Friday, June 13, 2014

ఓటమిపై ప్రజాభిప్రాయ సేకరణ


Courtesy: Eenadu

4 comments:

  1. Respected Sirs,
    Most of the people are aniticipating opposion parties have to raise their voice against misuse of policies,govt. schemes,Nalgonda water problems, electricity waste etc.Instead of going to small issues they have to act a major role in govt. for ex: TDP had brought to the notice of the people about Mines cases,Mr. Jagan involvement in the influence of his father etc.

    ReplyDelete
  2. Happy to share the following words from Sri K. Sudhakar Goud’s article published in the Andhra Jyothy daily, as they echo Loksatta Party’s transforming ideology …

    భూ హక్కులూ, నవ తెలంగాణ - కె. సుధాకర్ గౌడ్

    1947 నుంచి తెలంగాణ ఎదుర్కొన్న వెతలకు బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులదేనని చెప్పక తప్పదు. తెలంగాణకు జరిగిన అన్యాయాలకు కేవలం ఆంధ్ర నాయకులను మాత్రమే తప్పుపట్టడానికి వీలులేదు. ఎందుకంటే 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన అన్ని ప్రభుత్వాలలోనూ తెలంగాణ నాయకులు భాగస్వాములుగా ఉన్నారు.

    తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బిచ్చగాళ్ళకు చిల్లర నాణేలు విసరివేసినట్లుగా సంక్షేమ తాయిలాలు ఇవ్వడం కాకుండా ప్రతి వ్యక్తి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ నిజమైన ప్రజాస్వామిక స్వేచ్ఛను తమ తొలి ప్రభుత్వం ఇవ్వగలదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.

    అయితే సమ్మిళిత వృద్ధి సాధన ఎజెండాలో ఈ క్రింద నేను పేర్కొన్న అంశాలకు అగ్ర ప్రాధాన్యమివ్వాలి. అవి: పాఠశాల విద్య, ప్రాథమిక ఆరోగ్య భద్రత, భూ హక్కులు, మద్యపాన నిషేధం.

    పాఠశాల విద్య ప్రాధాన్యాన్ని గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. సామాజిక అభివృద్ధికి అది చాలా ముఖ్యం.
    తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించిన గణాంకాలను చూడండి : 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న మొత్తం పాఠశాలలు 43,659. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 31,000 (71 శాతం); ప్రైవేట్ పాఠశాలలు 12,944 (29 శాతం). తెలంగాణలో ఉపాధ్యాయులు మొత్తం 1,22,433 మంది. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 1,19,810 (54 శాతం), ప్రైవేట్ ఉపాధ్యాయులు 1,02, 623 (46 శాతం). బడుల్లో బాల బాలికల ప్రవేశాలు : మొత్తం- 61,29,384; వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారు 31,70,317 (52 శాతం); ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన వారు 29,59,067 (48 శాతం).
    ఈ గణాంకాలు చెబుతున్న సత్యమేమిటి? తెలంగాణలో పాఠశాల విద్యారంగంలో సగభాగం ఇప్పటికే ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంది (ఇది నిజానికి 60 శాతానికి పైగా ఉంటుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు). ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నవారిలో 35 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు చెందిన బాల బాలికలే. ఈ సామాజిక వర్గాలు శతాబ్దాలుగా వివక్షకు గురవుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు విద్యా పరంగా సరికొత్త రీతిలో వివక్షకు గురవుతున్నారు. మరి ఈ అంతరాలను రాబోయే ఐదేళ్ళలో గణనీయంగా తగ్గించవలసిన బాధ్యత తెలంగాణ కొత్త ప్రభుత్వంపై ఉన్నది.

    పాఠశాల విద్యారంగంలో ప్రమాణాల మెరుగుదలకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కొత్త కౌశలాలతో కూడిన మానవ వనరులను పెంపొందించుకోవాల్సిన అవసరమున్నది. లేనిపక్షంలో పాత తెలంగాణకు కొత్త తెలంగాణకు మధ్య తేడా ఏమీ ఉండబోదు.

    తెలంగాణలో ప్రస్తుతం పది జిల్లాలు ఉన్నాయి (వీటి సంఖ్య కనీసం 20కి పెరిగే అవకాశమున్నది). ఈ పది జిల్లాల్లోను 461 మండలాలు, 8000 గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలేవీ సక్రమంగా పనిచేయడంలేదని చెబితే సత్యాన్ని తక్కువగానే చెప్పినట్టవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన ప్రభుత్వాలేవీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ పట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని కేంద్రాల పట్ల సరైన శ్రద్ధ చూపలేదు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలలో 60శాతం మండలస్థాయి ఆస్పత్రుల్లోను, మిగతా వాటికి జిల్లాస్థాయి ఆస్పత్రుల్లోను మంచి వైద్యం చేయవచ్చు.

    నవ తెలంగాణలోనూ అత్యంత కీలకమైనదిగా కొనసాగే అంశం భూమి హక్కులు.

    గ్రామాలవారీగా భూములపై హక్కులు కలిగివున్న వారెవరు, ఎవరెవరికి ఎన్ని భూములు ఉన్నాయనే విషయమై తెలంగాణ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ఆచరణ సాధ్యంకాని ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులకు బదులు ఆచరణ సాధ్యమయ్యే నీటిపారుదల వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరచుకోవచ్చు. దీనివల్ల రైతులు అన్ని విధాలా లబ్ధి పొందుతారు. ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారమే కానీ నక్సలైట్ అంశం కాదు.

    విచారకరమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సారా విక్రయాలపై వచ్చిన ఆదాయంతోనే నడిచాయి. 2003లో రూ.3000 కోట్లుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం 2013 నాటికి రూ.30,000 కోట్లకు పెరిగింది! ఏ సామాజిక అభివృద్ధి సూచిక అయినా ఇంత వేగంగా పెరిగిందా? ఎంత సిగ్గుచేటు! సారా విక్రయాల ఆదాయంపై తెలంగాణ బడ్జెట్ ఆధారపడి వుండదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలి. అయితే సారా విక్రయాలను గణనీయంగా తగ్గించాలి. ప్రజల ఆరోగ్యానికి, రాష్ట్ర పురోభివృద్ధికి ఇది చాలా ముఖ్యం.

    ReplyDelete
  3. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రకు కట్టపెట్టడంపై మీ వైఖరి ఏమిటి?

    ReplyDelete
  4. My dear Jai, andhra is not pakistan. Try to fight for displaced people rights due to dams and hydroelectric projects not to raise useless regional tensions. Try to see the GOOD and UGLY sides of these projects then decide

    ReplyDelete