Wednesday, July 9, 2014

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జీ హెచ్ ఎం సీ కమిటీలను ప్రకటించిన లోక్ సత్తా పార్టీ2 comments:

 1. ప్రజలే ప్రభువులు కావాలి!

  దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అస్తవ్యస్తంగా వున్న సమయంలో కేంద్రంలోను, రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలేర్పడ్డాయి. కొత్త ప్రభుత్వాలీ పరిస్థితుల్ని సరిదిద్దగలవా, అలాగే వుంచుతారా, లేక మరింత దిగజారుస్తారా అనేది, వారి పనితీరునుబట్టి వుంటుంది. మంత్రివర్గాలు పూర్తిగా రాజకీయ నాయకులతోనే నిండిపోతే ఉపయోగం వుండదు. మేధావులు, నిపుణులైన వారుకొందరు మంత్రివర్గంలో వుండాలి. ‘‘ప్రజాస్వామ్యంలో, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడైన వ్యక్తి ఓ బ్యాంకులో గుమాస్తాగా పనిచేస్తూ వుండవచ్చును. కనీస ఆర్థిక సూత్రాలుకూడా తెలియని వ్యక్తి ఆర్థికమంత్రి కావచ్చును!’’ అనే మాట ఒకటున్నది. ఇలాగే మరిన్ని లోపాలు ప్రజాస్వామ్యంలో వుంటాయి. ఆ లోపాల్ని సరిదిద్దుకుంటూ పోవాలే తప్ప, ప్రజాస్వామ్యాన్ని వదులుకోలేం! సరిదిద్దుకోడమంటే, ఒక ఆర్థికశాస్తవ్రేత్తను ఆర్థికమంత్రిగాను, విద్యావేత్తను విద్యామంత్రిగానూ నియమిస్తేనే చాలదు. క్రిందస్థాయి నుండి పై స్థాయివరకూ వ్యవస్థీకృతమైన నైపుణ్యతను పెంచాలి.

  అయితే, ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఎన్నికల తీరునుబట్టి అటువంటి మేధావులు అసెంబ్లీలోకి, పార్లమెంటులోకి ప్రవేశించలేదు. ఉదాహరణకు, జయప్రకాశ్ నారాయణ మేధావి మాత్రమే కాదు, రాజకీయ ఆర్థిక రంగాల గురించి మంచి అవగాహన కలవారు. అనేక ప్రయోజనకరమైన సంస్కరణలనాయన ప్రభుత్వానికి సూచించగలిగారు. కాని, ఇటీవల ఎన్నికల్లో ఆయన లోక్‌సభకు పోటీచేస్తే డిపాజిట్ దక్కలేదు. ఎందుకంటే ఇటీవల ఎన్నికలు విపరీతమైన డబ్బు పంపిణీతో, కుల వర్గ బలాలతో, మందిబలంతో జరిగాయి. కనుక ఆయన ఓడిపోయారు. ఇదొక ఉదాహరణ మాత్రమే! ఎందరో ఇలాంటి వారున్నారు. ఇందుకు లోపమెవరిలో వుంది? ప్రజల్లోనూ, రాజకీయాల్లోను వుంది! మిగిలిన చోట్ల ఎలా జరిగినప్పటికీ, విద్యావంతులైన నగర పౌరులు కూడా అటువంటి వారినెన్నుకోలేరా? విపరీతమైన డబ్బు పంపిణీ చేసి, మందబలం చూపిన అభ్యర్థుల్లో కొంద రు నేర చరిత్ర కలిగినవారున్నారు. కాని వారు మాత్రం ఎన్నికయ్యారు. కేంద్రంలో అధికారంలోకొచ్చిన బి.జె.పి, రాష్ట్రంలో వచ్చిన తెలుగుదేశం పార్టీలు కూడా, ఇటువంటి అర్హులైన మేధావుల విషయంలో ఔదార్యం, విజ్ఞత చూపలేకపోయాయ. వారి పార్టీలకు చెందిఎన్నికల్లో ఓడిపోయిన వారిలో అర్హులనుకున్న కొందర్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదు.

  ప్రజలే ప్రభువులు అనేది ప్రజాస్వామ్యం యొక్క వౌలిక సూత్రం! మరి,ప్రజలు ప్రభువులుగానే వుండగలుగుతున్నారా? ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన అభ్యర్థులు ఖర్చుపెట్టిన కోట్లాది ధనం ప్రజాసేవ కోసమేనా? కాదు. కాదని అందరికీ తెలుసు. పదవి దక్కగానే, ఆ డబ్బుకు పదిరెట్లు రాబడతారు. ఇది ప్రజలకూ తెలుసు! తెలిసి కూడా అటువంటివారికే ఓటెయ్యక తప్పడం లేదు. ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి నాయకులకు అనేక వనరులూ, మార్గాలూ వున్నాయి. ఈ ప్రకృతి, ప్రభుత్వ వనరులన్నీ ప్రజలకు చెందినవే. ఏయేచోట్లలో, ఏ మార్గాల్లో దోపిడీ జరుగుతున్నదో ప్రజలకు తెలు సు. తెలిసి కూడా నాయకుల్ని, అధికారుల్నీ ప్రశ్నించలేకపోతున్నారు. ఎన్నికప్పుడు కొద్ది రోజులు మాత్రం ప్రజలు ప్రభువులుగా వుండగలుగుతున్నారు. ఆ సమయాల్లో నాయకులు ప్రజాసేవకుల్లా నటిస్తున్నారు. ఎన్నికలయ్యాక, సేవకులుగా అప్పటివరకూ నటించిన నాయకులు ప్రభువులుగా మారిపోయి, ప్రజలను సేవకులుగా చూస్తున్నారు. ప్రజావసరాలతో వారికి సంబంధం వుండడం లేదు. ప్రజలకెంతమాత్రం అందుబాటులో వుండడం లేదు. అధికారుల మీద వీరి పెత్తనం, తద్వారా ప్రజల మీద పెత్తనం చేస్తున్నారు. ఇది వారికి హక్కుగా మారింది. అణిగివుండడం ప్రజల వంతైంది!

  ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పిచ్చారని కొందరంటున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోబడి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ తీర్పునిచ్చారో అందరికీ తెలుసు. ఎంతకాలమిలా ప్రజలు సేవకుల్లా నిలబడాలి? జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రశ్నించగలిగేవరకూ అంతే! వారు ప్రశ్నిస్తున్న అంశాన్ని గూర్చిన సమగ్ర సమాచారాన్ని ప్రశ్నించడానికి ముందే వారు తెలుసుకోవాలి. సరైన సమాచారం లేకపోతే, నాయకులు, అధికారులూ బుకాయిస్తారు. ఆ తర్వాత ప్రతిఘటించాలి! ఎలా? ఒకరు కాదు, పది మం ది, వంద మంది ఒక్కసారిగా ప్రతిఘటించాలి! అంటే, పరిజ్ఞానంతో కూడిన, సంఘటిత ప్రతిఘటన ప్రజలు చేయగలగాలి! ఈ విధంగా ప్రజలు సత్తా పెరిగితే, నాయకులు, అధికారులూ దిగి వస్తారు. ప్రజలు సేవక స్థాయినుండి, యాజమాన్య స్థానానికెదుగుతారు. ఈ ప్రజాస్వామ్య పాలనలో ప్రజలే ప్రభువులవుతారు!

  - మన్నె సత్యనారాయణ
  (courtesy: Andhra Bhoomi daily)

  ReplyDelete
 2. i remember once writing on twitter to sri JP. we believe in success thru segmentation. or bite one piece at a time. before targeting state wide success, there is a golden opp now for LS identity as a city based party to garner support among every voter, native, tax contributor from hyderabad to be your member. promise and propagate LS as the party to preserve the self respect and self rule of hyderabadis and uphold the grace and dignity of hyderabad brand. there will never be a greater opportunity than now. and targeting GHMC elections should be the top most objective of LS by giving a clarity filled manifesto (ideally not to exceed 5 objectives)

  ReplyDelete