Thursday, June 19, 2014

సమస్యల పరిష్కారానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల కమిటీని ఏర్పాటు చేయాలి: లోక్ సత్తా


1 comment:

  1. Another quality article reiterates that Loksatta Party’s vision & agenda are the only proven ways to transform peoples’ lives. So happy to share these words also from the latest article published in Andhra Jyothy …

    మళ్ళీ సింగపూర్ స్ఫూర్తి (గల్ఫ్ లేఖ)-మొహమ్మద్ ఇర్ఫాన్

    “సీమాంధ్రను సింగపూర్‌కు దీటుగా అభివృద్ధిపరుస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను ఆంధ్ర ప్రజలు విశ్వసించి ఆ మేరకు అధికారం కట్ట బెట్టారు.

    సింగపూర్ జనాభాలో చైనా, మాలె ప్రజల తరువాతి స్థానంలో తమిళులు ఉన్నారు. అయినప్పటికీ తమిళనాడు లో సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకున్న సందర్భాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు సింగపూర్ అభివృద్ధి నమూనాను విస్తృతంగా ప్రచారం చేశారు. నగర రాజ్యమైన సింగపూర్ మౌలికసదుపాయాలలోనే కాక, మానవ వనరుల విషయంలో కూడా ప్రశంసనీయమైన అభివృద్ధి సాధించింది. విద్య, అందునా ప్రాథమిక విద్య విషయంలో సింగపూర్ ప్రపంచానికి ఆదర్శనీయంగా ఉంది. దురదృష్టవశాత్తు ఈ విషయాన్ని అటు ఆంధ్రప్రదేశ్ గానీ చంద్రబాబునాయుడు గానీ ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరం.

    దేశాభివృద్ధికి ఆవశ్యకమైనదేమిటి? రోడ్లు, నౌకాయాన మార్గాల కంటే విద్య అనే వాస్తవాన్ని గ్రహించిన ఆసియా దేశాలలో సింగపూర్ ఒకటి. దానికి తగినట్లుగా ఆ దేశం తమ ప్రాథమిక విద్యా వ్యవస్థను ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనదిగా తీర్చి దిద్దింది. సిరిసింపదలు సమృద్ధిగాగల గల్ఫ్ అరబ్‌దేశాలు తామూ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే విద్యే పునాది అని సింగపూర్ స్ఫూర్తితో అర్థం చేసుకున్నాయి. పటిష్ఠ ప్రాథమిక విద్యా పునాది లేకుండా ఎన్ని విమానాశ్రయాలు లేదా హైవేలు నిర్మించినా ప్రయోజనం లేదని గ్రహించి ప్రాథమిక విద్యా విధానాన్ని పటిష్ఠం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

    నగర రాజ్యమైన సింగపూర్ అతి చిన్న దేశమని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రపంచ వాణిజ్యంలో తమ దేశం అగ్రగామిగా ఉండడానికి తాము అనుసరించిన విద్యా, మానవ వనరుల అభివృద్ధి విధానాలేనని సింగపూర్ వాణిజ్య మంత్రి లీ యీ శాన్ తన గల్ఫ్ పర్యటన సందర్భంగా ఈ కాలమిస్ట్‌తో అన్నారు.

    గల్ఫ్ దేశాల తరహా తాము కూడ విదేశీ కార్మికులపై ఆధారపడినప్పటికీ భారత్‌తో సహా యావత్ ఆసియా దేశాలకు చేరుకోవడానికి సింగపూర్ సరైన స్థావరం అని ప్రపంచానికి చాటిచెప్పడంలో తాము సఫలమయ్యామని ఆయన అన్నారు. ఆసియాలోని అన్ని దేశాలతో తమకు మైత్రి వుందని, తత్కారణంగా ఆసియా హబ్‌గా సింగపూర్ ఆమోదయోగ్యం కావడానికి ఎంతైనా దోహదం చేసిందని లీ యీ శ్యాన్ తెలిపారు.

    సింగపూర్ ప్రస్తుత స్థాయికి చేరడం వెనుక ఐదు దశబ్దాలకు పైగా కృషి ఉంది. వివిధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి వాటిని చిత్తశుద్ధితో అమలుపరచడంలో అన్ని వర్గాల వారు సమష్టిగా పనిచేయడం వల్లే అద్భుత విజయాలు సిద్ధించాయి. చైనీయులు, మాలె ప్రజలు, తమిళులు కలిసికట్టుగా తమ దేశాన్ని అత్యున్నత పురోగతి శిఖరంపైకి తీసుకువెళ్ళారు.

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. చంద్రబాబునాయుడు ఆరు వరుసల రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవుల గురించి మాట్లాడుతున్నారు. సరే, ఉచిత పథకాలు ఉండనే ఉన్నాయి. ప్రభుత్వ విద్య, వైద్య విధానాల గురించి మాట్లాడడం లేదు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న పటిష్ఠమైన విద్యా, వైద్య వ్యవస్థలకు నూతన జవసత్వాలు సమకూర్చే అంశాన్ని పూర్తిగా విస్మరించారు. సింగపూర్ మొదట ఈ రెండు రంగాలను బాగా అభివృద్ధి చేసుకుని ఆ తరువాతే మౌలికసదుపాయాల విషయమై శ్రద్ధ పెట్టింది. భౌగోళికంగా గ్రేటర్ హైదరాబాద్ కంటే కొంచెం పెద్దదిగా ఉండే సింగపూర్ విభిన్న సంస్కృతులకు నెలవు. అన్ని జాతులవారు ఆ దేశ ప్రభుత్వంలో సగర్వ భాగస్వాములు.

    మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పరిస్థితి వేరు. ఉమ్మడి పంజాబ్‌కు లాహోర్ నగరం గుండెకాయ వంటిది. అసలు లాహోర్‌లేని పంజాబ్‌ను ఊహించడం కష్టం. దేశ విభజనలో లాహోర్‌తో పాటు, గురునానక్ జన్మస్థలం, సమాధి ప్రదేశం పాకిస్థాన్‌కు కోల్పోవడం జరిగింది. అయినా భారతీయ పంజాబ్ అనతికాలంలో పాటియాల నుంచి గురుదాస్‌పూర్ వరకు అభివృద్ధి చెందిందనే విషయాన్ని గ్రహించాలి.”

    ReplyDelete