Wednesday, April 20, 2016

మలిదశలో లోక్ సత్తా ఉద్యమం


4 comments:

  1. బాద్యత నుండి తపుకున్న లోక్ సత్తా.
    19 -4 -2016 జయ ప్రకాష్ నారాయణ్ మలిదశలో లోక్ సత్తా ఉద్యమం చదివిన తర్వాత, తీసుకున్న కష్టమయిన బాద్యత నుంచి దూరం జరిగినట్లు అనిపిస్తోంది. విచార కరం. బాధాకరం. సామాన్యులు, కార్మికులు తీసుకుంటే ఆపనిని నిర్వహించడం చాల కష్ష్టం. కానీ జయప్రకాశ్ నారాయణ్ వారు అంత కష్టం పడ నక్కరలేదు. లోక్ సత్తా పార్టీ భారత దేశం కోసం తీసుకున్న కర్తవ్యం -- రాజకీయాలలో అవినీతి ఉండ కూడదు. డబ్బు, మందు, బహుమతులు లేని రాజకీయాలు కావలి.. ఒక స్పష్టమయిన భావనతోనే లోక్ సత్తా పార్టీ ని ఏర్పాటు చేసు కోవడం జరిగింది. జయప్రకాశ్ నారయణ్ కు సంబంధించిన సామాజిక వర్గం కాని వారు కూడ ఎంతో ముందుకు వచ్చారు. పాల్గొన్నారు. లోక్ సత్తా పార్టీ గాకాకుండా ఉద్యమ సంస్థ గా కొంత భావ వ్యాప్తి జరిగిన ఫలితాల నివ్వ్వలేదు. టే బంకు లు కాకపొతే ఎదో పెద్ద హోటాల్ కూర్చొని పిచ్చ పాటి మాట్లాడు కోవదమేనా అనే భావన కొంతమంది లోకి వచ్చింది . అది సరి అయినదే. బలమయిన కార్యాచరణ ఇవ్వలేని ప్రజా సంఘాలు, చివరికి పిచ్చ పాటి సంఘాలు గానే తయరవుతాయి. కబుర్లు సంఘాలు గానే ఉంటాయి. అల ఉండటమే డబ్బుం మందు, బహుమతులు పంచె రాజకీయ పార్టీలకు కావసింది. ఇంకా వీళ్ళు రాజకేయలలోకి వస్తారేమో నని మీరు రావద్దు అలగే పిచ్చ పాటి మాట్లడు కొండి. అని ప్రోత్సహిస్తారు . డబ్బులు , చందాలు ఇస్ట్టారు. కాలక్షెపానికి పనికి వచ్చే సంఘాలు గా తయారు చేస్తారు. అల కాకుండా లోక్ సత్తా ఒక పార్తే గా వచ్చి నందుకు ఏంతో మంది ప్రజా తంత్ర వాదులు, దేశ బక్తులు సంతోషించారు. కాని అది కష్ట మయిన పని. అవసరమయితే రిస్క్ తీసుకోవాలి. నిజంగా జయ ప్రకాష్ నారయణ్ ఇతరులు తీసుకుంటున్న రిస్కు కూడా తీసు కోవలసిన అవసరం లేదు. కాని సిద్ద పడలేదు. కారణం తెలియదు. ఆ మ్ ఆద్మీ పార్టీ డిల్లి లో విజయ వంతం అవడానికి కారణం అక్కడ అరవింద్ కేజ్రివాల్ రిస్క్ తీసుకోవడమే. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోని ఆ మ్ ఆద్మీ పార్టీ నాయకులు అలాంటీ రిస్క్ తీసుకోవడానికి సిద్దపడలేదు. అందుకే ఆ మ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో ముదుకు వెల్ల లేక పోవడం జరుగుతుంది. ఇంకా విశ్లేషిస్తే ఢిల్లీ లో ప్రాంతీయ పార్టీలు లేక పోవడం కూడా ఆ మ్ ఆద్మీ పార్టీకి డిల్లీ ఉపయో గ పడింది. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటా అవినీతి కి వ్యతిరేకంగా పని చేయాలనుకున్న పార్టీలు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకొని ఆందోళనలు చేయాల్సి వస్తుంది. లోక్ సత్తా కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని ఆందోళనలు చేయాల్సి వస్తుంది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. మనది ప్రజా స్వామ్య దేశమని ప్రక టీం చు కున్నాం. ఇంకా రాజ్యంగ పీఠీiక లో సార్వభౌమ, సమ సమాజ లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ అని ప్రకటించు కున్నాం . అందరికి ఓటు హక్కు రాజ్యాంగ నిర్మాతలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడుతున్నాయి. కానీ మన రాజకీయ పార్టీలు ఎన్నికలను, ఎన్నికల సంఘాన్నీ, రాజ్యంగాన్నీ గౌరవిస్తున్నాయా అనే ప్రశ్న , దేశ భక్తులకు ప్రజాతంత్ర వాదులకు , వస్తోంది.
    ఎన్నికల సంఘం , పోలీసులు, ఎన్నికల్లో చేయవలసిన పని ఉన్నది . కాని ,మరి రాజకీయ పార్టీలు ఏమి చేస్తున్నాయీ. డబ్బు , బహుమతులు, మందు పంచుతూ, గుండాగిరి చేస్తూ ప్రజాసామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి. చివరికి రాజకీయాలంటే ఇవే అని అనుకునే స్థాయికి తీసుకు వచ్చాయి. ప్రజలను విజ్ఞాన వంతులుగా చేయకుండా ఈ పనులు చేస్తూ ప్రజస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తున్నాయి. నేషనల్ ఎలక్షన్ వాచ్ , అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎ. డి.ఆర్ ) అనే స్వచ్చంద సంస్థల అద్యయనం మేరకు, 31 శాతం ఎం.పి , ఎం.ఎల్.ఎ ల ఫై పోలిసుల రికార్డుల్లో క్రిమినల్ కేసులు పెండింగి ఉన్నాయని తెలుస్తోంది. 4807 మంది ఎం.పి లు ఎం.ఎల్.ఎ ల లో 14 60 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని స్వచ్చంద సంస్థలు తెలియ చేస్తున్నాయి. .
    ఇలాంటి రాజకీయ నాయకులకోసమేనా , రాజకీయాల కోసమేనా కేనా భగత్ సింగ్ , రాజగురు సుఖదేవ్ ఉరికంబానికి ఎక్కింది.. అల్లూరి ఆత్మా ఆర్పన చేసింది. ఇంకా ఎంతోమంది త్యాగం చేసింది. వీళ్ళ కోసమేనా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. తలచు కుంటూనే విచారం వస్తుంది. మాజీ హై కోర్ట్ జడ్జీ జస్టిస్ చంద్రకుమార్ గారు ఆవేదనతో
    గాంధీ మళ్ళీ పుడితే --- గాడ్సేలతో పని లేదు,
    భగత్ సింగ్ మళ్ళీ వస్తే --- బ్రిటిష్ వారికి భారం లేదు.
    అల్లూరి మళ్ళీ జన్మిస్తే -- ఆంగ్లేయులకు ఆందోళన లేదు.
    అవినీతి అక్రమాల అత్యాచారాల ఇనుప బూట్ల క్రింద నలిగే
    భరత మాత బాద చూసి గుండె పగిలి చస్తారు. లేదా,
    తుపాకి గుండై అవినీతిపై దూసుకు పోతారు.
    డైనమేట్లై అవినీతి పుట్టను పేల్చి వేస్తారు.
    మరి బ్రతికీ మనం ఏమి చేయలేమా., అనే ప్రశ్న వస్తుంది. చేయాల్సిన అవసరం ఎంతయినా వుంది. తిట్టుకుంటూ కూర్చోవడం కాదు చేయాల్సింది. చేయ గలం . ఇవన్నీ మార లని లోక్ సత్తా పార్టీ కోరుకుంటుంది . ఆశయం కూడా అదే. అదే విదంగా, ఆ మ్ ఆద్మీ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా , బి. ఎస్.పి కోరు కుంటున్నాయి. తమ శక్తి కొలది కృషి చేస్తున్నాయి

    ReplyDelete
  4. మన భారత రాజ్యాంగం రాసేటప్పుడు, బాబా సాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగా నిర్మాతలు. రాజకీయ ప్రముఖులు నెహ్రు, సర్దార్ వల్లబాయి పటేల్, రాజగోపాలా చారి రామ మనోహర్ లోహియా , మొదలయిన వారు రాజకీయ నాయకులు డబ్బు మందు , బహుమతులు పంచుతారని ఊహించలేదు. ముందు తరం వాళ్ళు తమకన్నా ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం, . లౌకిక తత్వం కోసం, సార్వబౌమత్వం కోసం పని చేస్తారని. ఆశించారు. కాని వారి ఆశలు ఆశయాలను తుంగలో తొక్కి, ఓట్ల కోసం ఫోటోలకు దండలు వేయడం చేస్తూ, ప్రజాస్వామ్యాన్నీ మంట గలుపుతున్నారు .
    ఈ నాడు. మార్పు కోసం ఒక చట్టం తీసుకు రావాలి. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు ముఖ్య పాత్ర వహిస్తాయీ. కావున వాళ్ళే బాద్యత తీసుకోవాలి. అదే సరి అయినది. రాజకీయ పార్టీల అద్యక్షులను, ప్రధాన కార్య దర్సులను బాద్య్లులు గా చేయాలి.. ఈ పరి స్థితి మారాలి. దీనికి రాజకీయ పార్టీలను బాద్యత చేయాలని వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్ధులు తాము ఎన్నికలలో డబ్బులు మందు, బహుమతులు పంచమని, ఎన్నికల్లో ప్రలోభాలకు,, ఎవరయినా తమ కార్యకర్తలు గురి చేస్తే తనను అరెష్టు చేయవచ్చునని , ఎన్నికల్లో నిలబడ నీయకుండా వుండే విధంగా ఆర్డర్స్ ఇవ్వవచ్చునని, వ్యక్తిగత డిక్లరేషన్ తీసుకోవాలి. అంతే కాకుండా బి. ఫారం ఇచ్చే పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా తమ పార్టీ అభ్యర్ధి మరియు ఎవరయినా పార్టీ కార్యకర్తలు చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేయరని , అలా వాళ్ళు చేస్తే తమను జైల్లో పెట్టవచ్చునని, పార్టీ రిజేష్ట్రేషన్ రద్దుచేయ వచ్చునని డిక్ల రేషన్ తీసుకోవాలి. అంటే, బిజెపి అమిత్ షా, కాంగ్రెస్ సోనియా గాంది , టిడిపి చంద్ర బాబు నాయుడు, టి.ఆర్ ఎస్ చంద్ర శేఖర రావు, వై.ఎస్.ఆర్ సి.పి జగన్ మోహన్ రెడ్డి, డిఎంకె కరుణానిది, ఎ.ఐ. డిఎంకె జయలలిత, సిపిఐ సుధాకర రెడ్డి, సిపిఐ ఎం సీతారాం ఏచూరి, అమ్ ఆద్మీ పార్టీ, కేజ్రేవాల్.., బి ఎస్ పి మాయావతి, అర్.జె డి లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ వాది పార్టీ ములాయం సింగ్ యాదవ్, జనతాదళ్ శరద్ యాదవ్ .. ..... .... ఇలాగా పార్ట్టే నాయకులను బాద్యులుగా చేయాలి. ఆవిధంగా రాజకీయ పార్టీల అద్యక్షులను, కార్యదర్శులను బాద్యులను చేయాలని వర్కర్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది . ఆ విధంగా ఎన్నికలలో మార్పు తీసుకు వచ్చి ప్రజాస్వామ్యాన్నీ కాపాడాలని వర్కర్స్ పార్టీ కోరుతుంది.. ఇలాగ చేయాలనీ కొంత మంది దీనికొరకు కృషి జరిగింది ఇంకా కృషి చేయాల్సి ఉంది. అవసరమయితే ఒక చట్టం. రాజ్యంగా సవరణ తీసుకు రావాలి. ఆ విధంగా చేయడం వలన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది . అందు కొరకు వర్కర్స్ పార్టీ ని అభి వుద్ది చేయాలని కోరుకుంటున్నాం అభివృద్ధి కి సహకరించాలని కోరు కుంటు న్నాం ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. అప్రజాస్వామిక శక్తులు నశించాలి. దేశాన్నీ కాపాడు కోవాలి.
    వేల్పురి కామేశ్వరరావు
    కన్వీనర్
    .వర్కర్స్ పార్టీ

    ReplyDelete