Monday, September 5, 2011

అవినీతి మరక అంటనిది ఉపాధ్యాయ రంగానికే: జేపీ


6 comments:

  1. గురువుల్లోనూ అవినీతిపరులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైడ్ బిజినెస్‌లు చెయ్యకూడదని నియమం ఉన్నా సైడ్ బిజినెస్‌లు చేసేవాళ్ళు ఉన్నారు.

    ReplyDelete
  2. ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను పైరవీలద్వారా సంపాదించుకునే సంస్కృతి వచ్చినప్పుడే ఈరంగానికీ మకిలి అంటుకుంది .ఏంచేస్తాం ?యుగప్రభావం

    ReplyDelete
  3. అయ్యా జయప్రకాష్ గారు ఉపాద్యాయులు ప్రయివేటూ చెప్పుకుంటూ విద్యని వ్యాపారం చేస్తున్న వాళ్ళు బడులకి హాజరు కాకుం డా జీతాలు తీసుకుంటున్న వారి సంగతి ఏమిటో

    ReplyDelete
  4. ఉపాధ్యాయలోకం యుద్ధప్రాతిపదికన మేలుకోవాలి
    అన్ని రంగాలలో వచ్చిన వికృతి విద్యారంగంలోను వచ్చింది.చాలా తేలికగా తీసుకోవడం,మనం యువతకు దార్శనికులం అనే స్పృహ లేకపోవడం,విలువలు లేని వాళ్ళు కేవలం ఉపాదిగానే టీచర్ అవ్వడం ఇలా ఏకరువు పెట్టుకుంటూ పొతే దేశంలో పేరుకున్న అవినీతి కంటే ప్రమాదం బడినీ పట్టి పీడిస్తుంది.
    ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని.వాళ్ళల్లో వున్న మంచి పార్శ్వాన్ని జే పి గారు ఉటంకించినా తీవ్ర అసంతృప్తి ప్రకటితమవుతుంది.
    ఉపాధ్యాయుడిగా చెయ్యకూడనివి చేస్తూ,చెయ్యాల్సినవి నిర్లక్ష్యం చేస్తున్న స్థితి దీనికి మూలం.ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళ స్థితి ప్రమాద ఘంటికలు మోగుతున్న స్థితి.
    ఇప్పటికయినా స్ప్రహ తెచ్చుకొని,విద్యా వ్యవస్థ ఉనికిని తద్వారా చైతన్యవంతమయిన సమాజాన్ని స్థాపించుకోవడం ప్రభుత్వాలకంటే కూడా ఉపాధ్యాయులదే అనే వాస్తవాన్ని గుర్తించకపోతే కొన్ని తరాలు తగలబడడానికి బాధ్యత వహించాలి.
    5000 సంవత్సరాల సంస్కృతీ మాదని గొప్పలు చెప్పుకునే మనం భ్రష్ట సమాజాన్ని నిందిస్తూ బార్బేరియన్ల భజనలో పునీతమవుతూ ఆత్మవంచనా పరవంచనా తోనే కాలం గడపాలి.
    అంతర్జాలంలో కాబట్టి ఈ వ్యతిరేకత అంతంత మాత్రం కనపడుతుంది.జనంలో చాలానే వుంది.జనం నాడి జే పి గారు ఉపాధ్యాయులకు చూపించారు అని భావిస్తే బావుంటుంది.ప్రజాస్వామ్య వ్యవస్థ లన్నింటి మీద వున్న విశ్వాసాన్నే ఉపాధ్యాయుల పైన వుంచినందుకు కృతజ్ఞతలు.ఆయన నమ్మకాన్ని ప్రోది చేస్తామని తెలియచేస్తూ,నమస్కరిస్తూ . . . . . . . .
    ఉప్పలపాటి మాచిరాజు
    ఉపాధ్యాయుడు
    తూర్పు గోదావరి

    ReplyDelete
  5. నీతి నిజాయితి విలువలు వృత్తిని బట్టి గాక వ్యక్తిగత స్వభావం సామజిక పరిస్తుతులను బట్టి ఉంటుందని న అభిప్రాయం. ప్రజలు చైతన్యవంతులైతే వాస్తవాలను గ్రహించగలిగే అవగాహనా సామర్ధ్యం పెంపుచేసుకో కలిగితే గురువులందరికీ తాము గురువులమని తమకు విలువలు ప్రదనమని తెలుసుకోవటం సమస్యే కాదని న అభిప్రాయం.

    ReplyDelete
  6. all comments are very good. The comments are 100% correct.

    ReplyDelete