చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్ వారికి తెలియ చేయునది ఏమనగా,
లోక్ సత్తా పార్టీ ఈ దేశం లో సమూల మార్పుల కొరకు ఎంతో శ్రమిస్తోందన్న విషయం మీకు తెలియనిది కాదు. వ్యక్తి కంటే పార్టీ మిన్న - పార్టీ కంటే దేశం మిన్న అనే ఉన్నత భావాలున్న పార్టీ లో కొందరు సీనియర్ ల విపరీతమైన ప్రవర్తన కారణంగా పార్టీ ఆశయాలకు భంగం ఏర్పడుతోంది. దీనిని సరిచేసే ప్రయత్నం లో భాగంగా పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ చర్చకు పెట్టినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డి వి వి ఎస్ వర్మ, కటారి శ్రీనివాస రావు, రమేష్ రెడ్డి లను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం మీకు తెలిసిందే. పార్టీ లో వారి ప్రాధమిక సభ్యత్వం కూడా రద్దుచేయటం జరిగింది. అందువలన పై ముగ్గురూ లోక్ సత్తా పార్టీ తరపున మాట్లాడే హక్కు ను మరియూ ప్రకటనలను జారీచేసే హక్కునూ కోల్పోయారు. అందువలన ఇక మీదట పై ముగ్గురూ జారీ చేసే ప్రకటనలకు లోక్ సత్తా పార్టీ కి ఎటువంటి సంబంధం లేదని వారు జారీ చేసే ప్రకటనలను లోక్ సత్తా పార్టీ ప్రకటనలుగా పరిగణించ వద్దని మిమ్ములను కోరుతున్నాము. వారిని లోక్ సత్తా పార్టీ నేతలుగా ఇక మీదట పరిగణించ వద్దని కూడా కోరుచున్నాము.
మరియూ ఈ క్రింది వారిని తాత్కాలికంగా పార్టీ తరపున మీడియా కు ప్రకటనలను విడుదల చేయుట కొరకు నియమించటమైనది.
శ్రీ సురేంద్ర శ్రీవాస్తవ, జాతీయ అధ్యక్షులు
శ్రీమతి హైమా పోతినేని, జాతీయ ప్రధాన కార్యదర్శి
శ్రీ శ్రీనివాస్ ఆలవిల్లి, ఛైర్ పర్సన్, లోక్ సత్తా పార్టీ కమ్యూనికేషన్స్
భవదీయ మీ,
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ
వ్యవస్తాపక అధ్యక్షులు,
లోక్ సత్తా పార్టీ
Sunday, March 1, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment