పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినందున సస్పెన్షన్ లో వున్న శ్రీ డి.వి.వి.ఎస్.వర్మ, శ్రీ కటారి శ్రీనివాస్ మరియు శ్రీ కారుటూరి శివరామకృష్ణ లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నట్లు లోక్ సత్తా పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్గత వ్యవహారాలను మీడియాలో పదే పదే ప్రస్తావిస్తూ వ్యవస్థాపకులు శ్రీ జయప్రకాష్ నారాయణ్ తో సహా పార్టీ నాయకులను దూషిస్తూ ప్రకటనలు జారీ చేయుట మరియు పార్టీని తమ స్వంత ఆస్తిలా భావించి ప్రజల్లో గందరగోళం కలిగించే ప్రయత్నం చేసినందున పార్టీ నిబంధనావళిలో ఆర్టికల్ XXVI ని అనుసరించి ఈ చర్య తీసుకోబడింది.
పైన పేర్కొన్న వ్యక్తుల లోక్ సత్తా తరుపు జారీ చేయు ఎటువంటి ప్రకటనలను గుర్తించవలదని ఈ సందర్భంగా ప్రజలకు మరియు మీడియా మిత్రులకు, లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ సురేంద్ర శ్రీవాస్తవ, ఉపాధ్యక్షుడు శ్రీ అశ్విన్ మహేష్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి హైమా పోతినేని విజ్ఞప్తి చేశారు.
Tuesday, March 17, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment