Wednesday, August 31, 2011

పటిష్టమైన లోక్ పాల్ రావడం తథ్యం., రాజకీయ ప్రక్షాళన మరింత కీలకం: జేపీ


3 comments:

  1. జే పి గారు చెప్పింది వాస్తవం. దాదాపు పదిహేను సంవత్సరాల
    నాడే ఈ విషయాలను ప్రస్తావించారు.
    ఎన్నికల సంస్కరణలు, రాజకీయ ప్రక్షాళన, లోక్పాల్,
    లోకాయుక్త, అంబుడ్సుమెన్ -- ఇంకా మరిన్ని మార్గాలు చెప్పే మేథావుల కొరత మనకు లేదు.
    ఉన్నదల్లా, సామాజిక వాదుల అనైక్యతే!
    Hanumantharao Tumma,
    Khammam.

    ReplyDelete
  2. రాజకీయం మాని జనహితం కోరాలి.
    కోట్లాది ప్రజలు అన్నా హజారేకు సంఘీభావం తెలుపుతూ రోడ్డుమీద నిలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం మీనా మేషాలు లెక్కపెడుతూ రాజకీయ నిర్ణయాలు సావధానంగా చేద్దామని కూర్చుంటే ప్రజలకు రాజకీయనాయకులతో పాటు ప్రభుత్వం పైన విశ్వాసం పోతుంది.ఆ తరువాత మన్మోహన్ సింగ్,అంటోని లాంటివారికి పై జాబితానుంచి మినహాయింపు వుండదు. అదీ జాతికి చేసిన హానే అవుతుంది.
    జనహితం కోసం చొరవ చూపని మంచితనం,పూర్వం చేసిన మేలులు ప్రస్తుతం జరుగుతున్న నష్టం కంటే ఎక్కువు ఏమి కాదు.చచ్చాక పది సీసాల రక్తం ఇవ్వడంకన్న తక్షణం 300 ml చాలా గొప్పది.
    భారత జాతి ఋణం తీర్చుకోవడం అవుతుంది.ఈ నేతల వోట్ల శాతాలు,వీరిలో ఎన్నికైన అధికశాతం గెలిచిన పద్దతి,యు పి ఏ పార్టీల పవిత్ర బంధాలు జనానికి సుపరిచితమే.బుకాయించడం మాని,జనలోక్పాల్
    లోని మెజారిటి అంశాలు చట్టం లో చేర్చి,దానికి తోడుగా ఎన్నికల సంస్కరణలు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలి.దేశంలో పాలన పూర్తిగా అరాచకవాదుల పాలుకానిదే మంచి వాళ్ళమని చెప్పుకొనే నేతలు మేలుకోకపోతే జాతి పూనుకొని మేలుకోలుపుతుంది.ఏలికల దుర్మార్గాన్ని ఎండగట్టే ఉద్యమాల బాట పడుతుంది.జాతిని సంఘటిత పరుస్తాం.
    ఉప్పలపాటి మాచిరాజు
    జిల్లా అధ్యక్షుడు
    లోక్ సత్తా ఉద్యమ సంస్థ
    తూర్పు గోదావరి జిల్లా

    ReplyDelete
  3. FOR ELECTED VERSUS UNELECTED - Please think of this Mahatma Gandhi was unelected --- so will you question him why he did so many good things being unelected
    This is one of the great comment i found on youtube.

    ReplyDelete